సింగపూరు
లోని
తెలుగు
వారందరూ
17వ
తారీకున
'సింగపూరు
తెలుగు
సమాజం'(STS)
ఆధ్వర్యం
లో
సంక్రాంతి
సంబరాలన!
ఘనంగా
జరుపుకున్నారు.
తెలుగు
పల్లెలను
మైమరపించే
విధముగా
మామిడాకులు,
స్వచ్చమైన
ఆవు
పేడతో
చేసిన
గొబ్బెమ్మలు,
పూలు
మరియు
చెరుకు
గెడ్డలతో అలంకరించిన
వేదిక
అందరినీ
ఎంతగానో
ఆకట్టుకుంది.దాదాపు
నాలుగు
గంటల
పాటు
సాగిన
ఈ
కార్యక్రమంలో
పిల్లలూ,
పెద్దలూ
ఎంతో
ఉత్సాహంగా
పాల్గొన్నారు.
జానపద
న్రుత్యాలు,
పాటలు,
పద్యాలు,
మిమిక్రీ
వంటి
అంశాలతో
కూడిన
ఈ
కార్యక్రమాన్ని
అందరూ
ఆశ్వాదించారు.
తెలుగింటి
ఆడపడుచులు
వేసిన
రంగు
రంగుల
ముగ్గులు
విచ్చేసిన
జనులందరినీ ఎంతగానో
ఆకట్టుకున్నాయి.కార్యక్రమానికి విఛ్చేసిన
చిన్నారులందరికీ మరియు తంబోలా విజేతలకీ
బహుమతులు ప్రధానం చేయటం జరిగింది. సంబరాలలో
భాగంగా విఛ్చేసిన అతిధులందరికీ మంచి రుచికరమైన
ఆంధ్రా వంటకాలతో కూడిన భోజనం ఏర్పాటు చేయటం
జరిగింది. కార్యక్రమం చివరిలో తీసిన బంపర్
డ్రా లో ఒక కుటుంబం గోల్డ్ ఫిష్ టూర్స్ వారి
మయంగ్సారీ రెసార్ట్స్ లో రెండు రోజులు ఉచితంగా
గడిపే అవకాశాన్ని గెలుచుకుంది. సంక్రాంతి
సంబరాలకు లభించిన విశేష జనాదరణకి సింగపూరు
తెలుగు సమాజం అధ్యక్షులు ఆరిమిల్లి
రాధాక్రిష్ణ గారు కృతజ్ణత తెలియజేస్తూ,
సింగపూరులో తెలుగు టి.వి. ఛానెల్స్ కోసం
చేస్తున్న ప్రయత్నాలను వివరించారు.
తెలుగు వారికి పెద్ద
పండుగలలో ఒకటైన సంక్రాంతి పండుగ సంబరాలను ఇంత
ఘనంగా, సాంప్రదాయబధ్దం గా నిర్వహించిన తీరు
పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు |
|
|